సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ ఘాటుగా విమర్శించారు. దళిత, గిరిజనులను ఎప్పుడో కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నమ్మక ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం.. దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఉంటే .. దళితులు ఇప్పటికే కోటీశ్వరులు అయ్యేవారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఉద్యోగాలు, విద్య.. ఇలా అన్ని ఇచ్చి ఉంటే దళిత బంధు అవసరం ఉండేదా అని ప్రశ్నించారు. దళిత బంధు అందరికి ఇవ్వాలంటే.. లక్షా 70 వేల కోట్లు అవసరమన్న మధుయాష్కి.. లబ్ధిదారులందరికీ చేరాలంటే ఎన్నేళ్లు పట్టాలో తెలుసా అని మండిపడ్డారు మధుయాష్కి. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులతో కేసీఆర్.. ప్రజలను మభ్యపెడుతున్నారని మధుయాష్కి అన్నారు. దళిత, గిరిజనులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.