మధు యాష్కీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్
కేసీఆర్ కులాల మధ్య చిచ్చు పెడుతూ లబ్ధి పొందుతున్నారు. దళితులకు 3 ఎకరాలు ఇచ్చి ఉంటే ప్రతీఒక్కరి దగ్గర గౌరవంగా సుమారు రూ.60 లక్షలు ఉండేవి. డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదు కానీ.. రూ.150కోట్లతో కవితమ్మ బంగ్లా కట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి. దళిత గిరిజన బహుజనులు అందరినీ కేసీఆర్ జీవితాంతం మోసం చేద్దామని అనుకుంటున్నారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది..? ఫీజులు కట్టలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కరీంనగర్, సిరిసిల్ల వేదికగా పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తోంది. మిషన్ భగీరథ కమిషన్ భగీరథ అయింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా వేయమని మోడీ కాళ్ల మీద పడి వేడుకున్నారు కేసీఆర్. ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఇప్పుడు ఏమీ చేయలేక బాధపడుతున్నారు.
గుండు ఎంపీ పసుపు బోర్డు అని ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకనాడు రబ్బర్ చెప్పులు వేసుకున్న నాయకులకు నేడు వందల ఎకరాలు, ఫాంహౌస్ లు ఎలా వచ్చాయి. చెట్ల సంతోష్ రూ.50 చెట్టును రూ.500 కు అమ్ముకుని దందా చేస్తున్నాడు. అందరూ తెలంగాణ భవిషత్తు కోసం ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ ప్రజలను దోచుకుతింటున్నారు. తెలంగాణ వచ్చాక ఒక్క సమావేశం కూడా ఆరోగ్యంపైన పెట్టలేదు ఈ ప్రభుత్వం.
ఏ ఒక్క బిడ్డ ప్రాణం పోవద్దు అని సోనియా గాంధీ తెలంగాణ రాష్టాన్ని ఇచ్చారు. కానీ.. తెచ్చుకున్న తెలంగాణను రాబందుల కుటుంబం దోచుకుతింటోంది. కృష్ణానీళ్లను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా దోచుకుపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు..? తెలంగాణ తెచ్చుకుంది గొర్రెలు, బర్రెలు, సన్న బియ్యం కోసం కాదు.. ఉద్యోగం, పిల్లల భవిషత్తు బాగుండాలని తెచుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎవరినీ వదిలేది లేదు.
గమ్యం లేని బండి ఎందుకు ఈ పాదయాత్ర. మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. కరోనా టైంలో నరేంద్ర మోడీ నియోజకవర్గంలో పవిత్ర గంగా నదిలో శవాలు తేలాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఈ రెండు అరాచక పార్టీలను గద్దె దించేందుకు తెలంగాణ బిడ్డలు తెగువ చూపాలి. మహాకవి కాళోజీ ఒక్కటే అన్నారు. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమెరదాక తరమికొట్టండి.. ప్రాంతం వాడే మోసం చేస్తే ఇదే ప్రాంతంలో పాతర పెట్టండి’.