మధు యాష్కీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్
సీఎం కేసీఆర్ కులాల వారీగా ప్రజలను విడదీసే కుట్ర చేస్తున్నారు. దళిత బంధుతో పాటు బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలి. రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు అమలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి యూత్ కాంగ్రెస్ నాయకులు తీసుకెళ్లాలి.
యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తా. తెలంగాణలో భారీగా జరుగుతున్న అవినీతి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమాలపై పోరాటం చేయాలి.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది..? బీజేపీ మతతత్వ పార్టీ. వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ, పువ్వు పార్టీ రెండూ పల్టీ కొడతాయి. రాహుల్ గాంధీని ప్రధానిగా చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పని చేయాలి.