మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఉపఎన్నిక వస్తేనే నియోజకవర్గాలకు నిధులు విడుదలవుతున్నాయి. కాబట్టి శనివారం నుంచి సమన్వయ కర్తలు రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్తారు. కేసీఆర్ మోసాలను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరిస్తారు. ప్రతీ ఎమ్మెల్యే తమ పదవికి రాజీనామా చేయాలని వాళ్ల ఇంటిముందు డప్పు చాటింపు వేయిస్తున్నాం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం. హుజూరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.