ప్రజల హక్కులను పోలీస్ లు కాలరాస్తున్నరని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి.
ప్రజా ప్రతినిధుల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ.. ప్రజల హక్కులను పోలీసులు కాల రాస్తున్నారని ఇది ప్రజాస్వామ్యం లో ఇది మంచిది కాదని టీపీసీసీ ఉపధ్యక్షులు మల్లు రవి అన్నారు.
ఈ విషయమై ఆయన శనివారం నాడు ఒక ప్రకటన చేస్తూ ప్రజల సమస్యలను ఎత్తి చూపే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉంటుందని, నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు అని ఆయన అన్నారు.
నిన్న కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మె సందర్బంగా పోలీసులు ఎమ్యెల్యే లు, ఎంపీ ల పట్ల చాలా దురుసుగా, అప్రజాస్వామ్యంగా ప్రవర్తించారని పాలన పోలీసుల చేతికి వెళితే అది ప్రజలకు మంచిది కాదని అన్నారు. హక్కులను కాలరాస్తే ఉద్యమం మరింత తీవ్రం అవుతుందని అన్నారు.