మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు
దళితులకు వాటాగా రావాల్సిన రూ.65 వేల కోట్లు ఖర్చు చేయకుండా దగా చేశారు కేసీఆర్. దళితులకు మూడెకరాల భూమి ప్రస్తావన గాలికొదిలేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎత్తేసి.. దళితుల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని మోసం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన భూముల్ని లాగేసుకుంటున్నారు. రిజర్వేషన్లతో దళితులకు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే దళితులకు ఎంతో మేలు జరిగి ఉండేది.