కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అత్యాచార ఘటనలపై ఎమ్మెల్యే రమేష్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సభ్య సమాజానికి తలవంపులు తెచ్చేలా ఉన్నాయి. అత్యాచారం తప్పుదు అనిపించినపుడు పడుకొని ఆనందించాలని మహిళలను ఉద్దేశించి అన్నారు. సభా వ్యవహారాలపై అవగాహన ఉన్న మాజీస్పీకర్ ఇలా మాట్లాడటం పట్ల పలువురు విస్మయానికి గురవుతున్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ మహిళా సభ్యులతో సహా పలువురు శాసనసభ్యులు సభలోనే నిరసన తెలిపి, ఖండించారు. రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేపీసీసీ అధ్యక్షుడిని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు.