లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని… 15వేల లోపు ఇంటి అద్దె ఉన్నవారికి ప్రభుత్వమే అద్దె చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. విద్యుత్, నల్లా బిల్లులను కూడా ప్రభుత్వం మాఫీ చేయాలని… కోట్లాది రూపాయాలతో ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వం వీటిని కూడా ప్రజల కోసం భరించాలన్నారు.
ఏఐసీసీ సూచన మేరకు నిత్యం గ్రౌండ్ లోనే ఉండి ప్రజలకు తోడుంటున్నామని… కేంద్రం కూడా రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణలో కరోనా వైరస్ పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు.