కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. మనుషులంతా సమానమే అనే సందేశాన్నిచ్చే క్రమంలో ఆయన ప్రవర్తించిన తీరు వైరల్ అవుతోంది.
ఈద్ మిలాద్ సందర్భంగా ఆల్ అజర్ ఫౌండేషన్ పారాయణపూర్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. వేదికపై ఎమ్మెల్యే విచిత్రంగా ప్రవర్తించడంతో అందరూ ఒక్క సారిగా అవాక్కయ్యారు.
దళిత స్వామిజీ నారాయణకు ఎమ్మెల్యే ఆహారాన్ని ఇచ్చాడు. స్వామి దాన్ని నములుతుండగా బయటకు ఉమ్మి వేయాలని అన్నాడు. దీంతో ఆయన ఆహారాన్ని ఉమ్మగా దాన్ని తీసుకుని ఎమ్మెల్యే తిన్నాడు.
తమ ఇరువురి మధ్య ఎలాంటి కుల వివక్షలేదని, అందరూ సోదర భావంతో ఉండాలని చెప్పేందుకే తాను ఈ పని చేసినట్టు ఎమ్మెల్యే చెప్పారు. దీంతో స్టేజిపైన ఉన్న వారంతా చప్పట్లు కొట్టారు.