స్పీకర్‌కు ప్లైయింగ్ కిస్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. దీంతో శాసనసభ్యులంతా అవాక్కై… ఒక్కసారిగా నవ్వారు. అయితే, ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని… ఈ రోజు సమయం ఇవ్వటంతో కృతజ్ఙతతోనే ఇలా చేశానని తెలిపారు.
ఒడిషా అసెంబ్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ ఎస్.ఎన్ పాట్రోకు కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహినీపతి ప్లైయింగ్ కిస్ ఇవ్వటం ఇప్పుడు వైరల్ అవుతోంది.