రైతులు బానిసలుగా బతకాలా? - Tolivelugu

రైతులు బానిసలుగా బతకాలా?

జగ్గారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

పంటల పై సీఎం విచిత్ర ప్రకటన చేస్తున్నారు. సీఎం ప్రకటనతో రైతులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. ఇప్పటి వరకు ఏ పంట వేయాలనే నియంత్రణ లేదు, తన భూమిలో ఏ పంట వేయాలో రైతుకు తెలుసు రైతు పంటకు రైతు బంధు కు లింకు పెట్టడం దురదృష్టం. ఏ పంట వేసుకోవలో కూడా రైతుకు స్వేచ్ఛ లేకుండా పోతోంది. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతుబంధు తోనే రైతులు బతుకుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. రైతుబంధు ను తప్పించడానికే షరతులు పెడుతున్నారు.. రైతులు బానిసలుగా బతకాలా? కూరగాయల రైతుకు రైతు బంధు వర్తిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి. ఇక మీదట ప్రజలు ఏం తినాలో కూడా సీఎం నిర్ణయించేలా ఉన్నారు. కేసీఆర్ చెప్పిన పిల్లనే చేసుకోవాలి అనేలా ఉన్నారు.
ఏం పంట వేయాలో, ఏం తినాలో నిర్ణయించే అధికారాం సీఎం కు ఎవరిచ్చారు. ప్రజలు గాలి పీల్చుకోవాలన్న సీఎం అనుమతి తీసుకోవాలా?

Share on facebook
Share on twitter
Share on whatsapp