టీఆరెస్ ప్రభుత్వంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బాగుపడుతుందని…ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే మీరు చేసేది ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలని ఆర్టీసీ సమస్యను జఠిలం చేస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల కోసం 43 రోజులుగా సమ్మె చేస్తున్నా…ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని…ఆర్టీసీ ఉంటేనే టిక్కెట్ల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని జగ్గారెడ్డి చెప్పారు. ఆర్టీసీ కేవలం కార్మికులది మాత్రమేనని ప్రజలు అనుకోవద్దని కోరారు. మహారాష్ట్రలో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు నరకం అనుభవిస్తున్నారని వెల్లడించారు. ప్రైవేట్ వారు కేవలం లాభాపేక్ష కోసమే పనిచేస్తారన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హనుమంతరావుల సూచనల మేరకు ఈ నెల ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఈనెల 19న సడక్ బంద్ లో పాల్గొని సంగారెడ్డి-ముంబై హైవేను దిగ్బంధనం చేస్తానని చెప్పారు.