130 అడుగుల గాంధీజీ విగ్రహ స్థాపన కోసం సీరియస్ గా పని చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నా స్నేహితుల సహాయంతో విగ్రహ స్థాపన జరుగుతుంది. విగ్రహ స్థాపన కోసం స్థల సేకరణ ప్రయత్నాలు చేస్తున్నాము. హర్యానాకు చెందిన యూనివర్సల్ ఇండియా విగ్రహాల తయారీ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాము. విగ్రహ స్థాపన కోసం ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి టిపిసిసి-రాష్ట్ర నాయకత్వం తో భూమి పూజ చేయిస్తామని జగ్గా రెడ్డి తెలిపారు. భావి తరాలకు గాంధీ ఆదర్శాలు గుర్తుండే విదంగా విగ్రహ స్థాపన ఉంటుంది. ఎలాంటి పరిస్థితిని అయినా శాంతి మార్గంలో నడిచేలా గాంధీ ఆలోచనలు ఉంటాయి. గాంధీ విగ్రహం పక్కనే మరో ముగ్గురు మహనీయుల విగ్రహాలు నెలకొల్పేలా ఆలోచన చేస్తున్నాము. భారత దేశంలో 130 అడుగుల ఎత్తైన గాంధీ విగ్రహం లేదు. రాబోయే రోజుల్లో రావాలని మేము పునాది వేస్తున్నామని తెలిపారు జగ్గారెడ్డి.