మంత్రి హారీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటల యుద్ధం ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగ్గారెడ్డి సూటిగా హరీష్ రావును ఎన్నోసార్లు టార్గెట్ చేశాడు. టీఆర్ఎస్ నుండి జగ్గారెడ్డి వెళ్లిపోయిన నాటి నుండి మొన్నటి వరకు ఈ వైరం కొనసాగింది. సింగూరు నీళ్ల దొంగ హరీష్ రావు అంటూ జగ్గారెడ్డి ఫైర్ అయిన సందర్భాలు అనేకం.
అయితే, హాఠాత్తుగా జగ్గారెడ్డి ఆ మధ్య హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తటం, సంగారెడ్డిలో ఏకంగా సన్మానించటంతో వీరిద్దరి మధ్య పరిస్థితి చక్కబడింది.
కేటీఆర్ ఫాంహౌజ్ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాక జగ్గారెడ్డి ఫాంహౌజ్ ముట్టడికి బయల్దేరాడు. కానీ హాఠాత్తుగా తర్వాత రోజు నుండే రేవంత్ రెడ్డిపై ఫైర్ అవుతూ మాట్లాడి వార్తల్లో నిలిచాడు. కానీ ఇప్పుడు హాఠాత్తుగా మంత్రి హరీష్ రావు ఇంట్లో జగ్గారెడ్డి ప్రత్యక్షమయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ ఫోటో వైరల్ అవుతోంది. హరీష్ రావు ఇంట్లో నుండి జగ్గారెడ్డి బయటకు వస్తున్న ఫోటో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో, అటు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
జగ్గారెడ్డి… రేవంత్ రెడ్డి టార్గెట్ చేయటం వెనుక ఉన్నది హరీష్ రావా అని కొందరు, సీఎం కేసీఆర్ కోటరిలో జగ్గారెడ్డి కోవర్టా అని కొందరు, జగ్గారెడ్డి నియోజవకర్గం అభివృద్ధి కోసం స్వయంగా ఇంటికి వెళ్లి కలిసి వచ్చినట్లు ఉన్నాడు అని కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తు్నారు.