జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంగారెడ్డి మరియు రాష్ట్ర ప్రజల పక్షాన సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడిగా మీకు ఒక వినతి. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ లు ప్రారంభించడం సంతోషం. ఎల్ ఆర్ ఎస్ పై నిర్ణయం తీసుకోవడం ఒకటి మిగిలుపోయింది. ఇపుడున్న ఆర్ధిక పరిస్థితుల్లో ఈ కరోనా మహమారితో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు.
గత కొన్ని సంవత్సరాల క్రితం 2 లేదా 3 లక్షలకు ఫ్లాట్ కొన్న వ్యక్తి ఇప్పుడు అదే ధరతో ఎల్ ఆర్ ఎస్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఆ డబ్బులు కట్టలేరు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భారం కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. ఎల్ ఆర్ ఎస్ ని రద్దు చేస్తూ కట్టుకున్న ఇండ్లను,ఫ్లాట్ లను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ప్రజలకు ఆర్ధిక భారం కాకుండా 10 వేల రూపాయలు నామమాత్రంగా రుసుము కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రజలకు ఇవ్వాలని కోరుతున్నాను. ఈ ప్రకటన త్వరగా వస్తే రాష్ట్రా ప్రజలు హర్షిస్తారు.