అధికారులు, ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రభుత్వమే… ఎమ్మార్వో హత్యకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. వీఆర్వో-ఎమ్మార్వో వ్యవస్థపై చెడు ప్రచారం చేసి, భూవివాదాలలో చిచ్చురేపారని మండిపడ్డారు. ఎమ్మార్వో హత్యకు సీఎం వ్యాఖ్యలే కారణమని, ప్రజల్లో రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించారని ఆరోపించారు. తన సొంత పత్రికలో ధర్మగంట పేరుతో… లేనిపోని ఆరోపణలు చేయించి, అధికారుల్లో నూన్యత భావానికి కారణమయ్యారని విమర్శించారు.