చిన్నారెడ్డి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
10 తేదీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని హాలియాలో వరాలు కురిపించారు. 11 న ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వారికీ ముందే తెలిసి సభ పెట్టారు. తెలంగాణ ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు నిరాశలో వున్నారు. వచ్చే నెల జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ కి తగిన బుద్ది చెప్పాలి. కేసీఆర్ కాకుండా కేటీఆర్ కూడా నిరుద్యోగ భృతి, పీఆర్సీకి ఇస్తామని చెప్పారు. బిస్వాల్ రిపోర్ట్ వచ్చాకా కూడా స్పందించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగులు కూడా నిరాశలో వున్నారు.తెలంగాణ వచ్చాకా ఇంటికో ఉద్యోగం వస్తుందని అందరు భావించారు.50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం.. ఎన్నికల కోడ్ వచ్చాక. అవి కూడా భర్తి చేయరని అర్ధమవుతుంది.
రాష్ట్రంలో అన్ని డిపార్ట్ మెంట్లో లక్ష 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పింది.కానీ నిన్నటి వరకు రాష్ట్రంలో 2 లక్షల 69 వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయి.ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద 75 వేల రూపాయలు బాకీ పడింది.చదువుకున్న నిరుద్యోగులకు సర్కార్ అన్యాయం చేస్తుంది.రిటైర్ మెంట్ ప్రక్రియలో ప్రతి నెల 800 మందు రిటైర్ అవుతున్నారు. ఆ స్థానంలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు.
తెలంగాణ సాధించే విషయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు పనిచేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో ప్రజలకు అన్యాయం జరుగుతుంది. రాబోయే ఐదారు నెలల పాటు రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకొని.. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేసే అవకాశం వుంది.