తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వచ్చే ఆర్ధిక సంవత్సరానికిగాను 45,300రూపాయలు అప్పు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయిందని.. దీంతో తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 3.18 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మద్యం అమ్మకాలలో మాత్రమే టీఆర్ఎస్ పురోగతి సాధించిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షం సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసిందన్నారు జీవన్ రెడ్డి. ఐటి రంగంలో తెలంగాణ యువత ఉద్యోగాల గురించి అడిగితే… మంత్రి హరీశ్ రావు క్యాటరింగ్ అవకాశాలు వచ్చాయని అంటున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వారిని తాగుబోతులను చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు.