కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు, ఎంపీ కార్తీ చిదంబరం కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్‌గా నిర్దారణ అయిందని చెప్పారు. వైద్యుల సలహామేరకు హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలిపారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని సూచించారు.