తెలంగాణ ప్రజలందరినీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిచ్చగాళ్ళని చేస్తున్నాడని ఆరోపించారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ నిర్ణయాలవల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీపై జగన్ తీసుకున్న నిర్ణయాలను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని, దానికోసం ప్రజలందరూ కూడా ఒకే తాటి పైకి రావాలని కోరారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో తెరాస ని ఓడించాలని కోరారు.