నిన్ను బొందపెట్టినా తప్పు లేదు : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి - Tolivelugu

నిన్ను బొందపెట్టినా తప్పు లేదు : కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన 203 జీవో తెలంగాణ ను ఎడారి చేస్తుందని ఆరోపించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . దాదాపు 15 టీఎంసీ ల నీటిని అక్రమంగా ఆంధ్రకు తరలించే కుట్ర జరుగుతోందని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు . ఇదంతా తెలంగాణ ద్రోహి కెసిఆర్ వల్లే అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తూ , పాలమూరు రంగారెడ్డి, డిండి [ప్రాజెక్టులను పక్కనపెట్టి పద్దతి ప్రకారం దక్షిణ తెలంగాణ ను ఎడారి చేసే కుట్ర జరుగుతోందన్నారు. మొన్నటి ప్రెస్ మీట్ తరువాత ఇంతటి దౌర్భాగ్యుడు తెలంగాణ కు ముఖ్యమంత్రా అని మండిపడ్డారు . తెలంగాణ లో పుట్టి తెలంగాణ ను నాశనం చేస్తున్నావన్నారు . లక్షల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు .

Share on facebook
Share on twitter
Share on whatsapp