సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చవకగా వస్తున్న విద్యుత్ ను వదిలి, నాలుగు ప్రైవేట్ విద్యుత్ సంస్థల దగ్గర ఖరీదైన విద్యుత్ ను కొనుగోలు చేసి, కమీషన్ కోసం 2605 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి . పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ కు నీటి తరలింపు వెనుక తెలంగాణ కు విద్యుత్ అందిస్తున్న ప్రైవేట్ విద్యుత్ సంస్థల లాబీయింగ్ ఉందన్నారు . తెలంగాణ ని పూర్తిగా అంధకారంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు . 25పైసలకు లభించే విద్యుత్ కాకుండా , శ్రీశైలం, నాగార్జున సాగర్,పులిచింతల ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి యూనిట్ కు 10 నుండి 20 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేసి తెలంగాణ ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారం వేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ కు తరలించే మిగులు జలాలు పులిచింతల నుండి సేకరించాలని, శ్రీశైలం నుండి తరలిస్తే జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నలుగురు కాంట్రాక్టర్లకు మేలు చేయడానికే కెసిఆర్ ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నారని, తెలంగాణ అమరుల ఆశయాలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి .కెసిఆర్ చెప్పేదానికి , చేసేదానికి సంబంధం లేదన్నారు . దమ్ముంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కెసిఆర్ , కేటీఆర్ ను సవాల్ చేశారు .