తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పులు మోసింది ఈ ముఖ్యమంత్రి కేసీఆరే అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కు మూటలు మోసింది కూడా కేసీఆరే అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అన్ని పార్టీలతో పొత్తుపెట్టుకున్నది కూడా కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.
మాగం రంగారెడ్డి ఎమ్మెల్సీ కోసం ఎమ్మెల్యేలను అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. సీఎం అయ్యాక తెలంగాణకి ఏం చేసావో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్ టైం పాస్ గా మారిందని విమర్శించారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకున్నారన్నారని…కేసీఆర్ మాట్లాడే సమయం ఎన్నికలే అని రేవంత్ హితవు పలికారు.