కృష్ణా నుండి రాయలసీమ కు అన్యాయంగా అక్రమంగా దక్షిణ తెలంగాణ ను ఎడారి చేస్తూ జగన్ కెసిఆర్ ఆడుతున్న జగనాటకానికి తెరదించాల్సిన సమయం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి . ఆనాడు పోతిరెడ్డి పాడు ఎత్తును పెంచాలనుకున్నప్పుడు హైదరాబాద్ బ్రదర్స్ గా ఉన్న పీజేఆర్ , మర్రి శశిధర్ రెడ్డి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడారని , వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు .కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పాలమూరు , నల్గొండ ను సస్యశ్యామలం చేసే ప్రయత్నం చేశారన్నారు . కేవలం 1000 కోట్లు ఖర్చు పెడితే , 10లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పాలమూరు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని , కనీసం ఆ పని కూడా చేయలేకపోయారని విమర్శించారు .
రోజా పెట్టిన నాటుకోడి పులుసు తిన్న రోజే ఈ నిర్ణయం జరిగిపోయిందన్నారు . ఇది జగన్ కెసిఆర్ కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు . ఆనాడు రాయలసీమ ను రతనాల సీమను చేస్తాను అని కెసిఆర్ అనడం ఇందులో భాగమే అన్నారు .అదే విధంగా నమస్తే తెలంగాణ , సాక్షి దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూపిస్తూ ఉతికి ఆరేసారు . కెసిఆర్ , జగన్ మోహన్ రెడ్డి ని విడదీసి చూడాల్సిన అవసరం లేదన్నారు .