ప్రగతి భవన్‌లో నీ కుక్క చనిపోతే కేసు పెట్టారు… మరీ ఆర్టీసీ కార్మికుడు మీ తీరుకు బెంగతో ఆత్మహత్య చేసుకుంటే కేసులు పెట్టారా… అని ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. నీ కుక్కకు వైద్యం చేసిన వైద్యుడిపై 5 సంవత్సరాల శిక్ష తగ్గకుండా కేసులు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి మానుకొని, వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని… లేదంటే ఈ నెల 21న ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈనెల 19న ఆర్టీసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలన్నీ బంద్‌లో పాల్గొనాలని తెలిపారు.
ఎర్రబెల్లి, తలసానిలాంటి మంత్రుల మాటల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, వెంటనే వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ప్రాణత్యాగాలు వద్దు… మీకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు.