ఓటమి ఎరుగని నేతకు ఓటమి రుచి చూపించిన కొడంగల్‌పై రేవంత్ ఏమనుకుంటున్నారు..? మల్కాజ్‌గిరి ఎంపీగా సెటిల్ అయిన రేవంత్ ఇక కొడంగల్‌ను వదిలేసినట్లేనా..? మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కొడంగల్‌కు వెళ్తారా లేదా..? ఎన్.ఆర్.ఐలతో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు.
కొడంగల్… రేవంత్ రెడ్డి మాస్ లీడర్‌గా ఎదకముందు ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కర్ణాటక బార్డర్‌లో ఉండే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. కానీ అనూహ్యంగా 2018ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు రేవంత్. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కీలక నేతలంతా కొడంగల్‌లో రేవంత్ ఓటమే లక్ష్యంగా పనిచేసి విజయం సాధించారు. తనకు ఓటమే లేదనుకొని, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రేవంత్ ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు. దాంతో రేవంత్ ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీచేసి గెలుపొందటంతో కొండగల్ ఊసెత్తటం కూడా మర్చిపోయారు పొలిటికల్ లీడర్లు.
అయితే, కొడంగల్‌తో రేవంత్‌రెడ్డి బంధం ముగిసినట్లేనా…? అనే డౌటు అందరికీ ఉంది. కొడంగల్ కాంగ్రెస్ శ్రేణులకైతే ఇది మరీ ఎక్కువ. అప్పుడప్పుడు రేవంత్ కొడంగల్ వెళ్లినా… రేవంత్‌రెడ్డి తిరిగి కొడంగల్‌కు వస్తారో రారో అన్న అనుమానంతోనే కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. అయితే, అమెరికాలో జరిగిన ఎన్.ఆర్.ఐల మీటింగ్‌లో పాల్గొన్న రేవంత్ తన మనసులో మాటను తొలివెలుగు.కామ్ సంపాదించింది.
తాను మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచినా… రాబోయే రోజుల్లో కొడంగల్‌లో మళ్లీ పోటీచేస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ నిర్ణయం మేరకు మల్కాజ్‌గిరిలో పోటీ చేశా. కొడంగల్‌లో ఓడిపోతాను అనుకోలేదు ఓడిపోయా. మల్కాజ్‌గిరిలో గెలుస్తానన్న అంచనాలు లేవు కానీ గెలిచా. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు… అయితే, తనకు కొడంగల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది, ఖచ్చితంగా కొనసాగుతుందని రేవంత్ ప్రకటించారు. నేను మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నందున ఎవరైనా నా కొడంగల్ సీటును అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదని… కొడంగల్ నాదేనని స్పష్టం చేశారు.
ALSO READ:
సమ్మెపై ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న