ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి. వారి ఒత్తిడి వల్లే దాడి జరిగిందని సమాచారం ఉందని ఆరోపించారు. దాదాపు 500 ఎకరాల భూ వివాదమే దాడికి కారణమయిందని… మేజిస్ట్రేట్ పవర్స్ ఉన్న అధికారిపై దాడి జరగటం దారుణమన్నారు.
కేటీఆర్, ప్రభుత్వ పెద్దలు… దాడి చేయాలని పిలుపునివ్వటం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారి హత్య జరిగితే కనీసం ప్రభుత్వ పెద్దలు కుటుంబ సభ్యులను పరామర్శించలేదని, అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలివ్వలేదని మండిపడ్డారు. రెవెన్యూశాఖ సీఎం దగ్గరే ఉంది… తన శాఖలో ఉద్యోగి హత్య జరిగితే సీఎం పరామర్శకు రారా అని ప్రశ్నించారు. రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించటం వల్లే ఇలా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
మొత్తం ఘటనపై సీబీఐ విచారణకు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ALSO READ: ఎమ్మార్వో విజయారెడ్డి హత్యలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దందా…?