
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు తెలంగాణ లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చెయ్యట్లేదు. కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం ఎందుకు. 7 ఏళ్లలో పది లక్షల కోట్ల బడ్జెట్ లో 7వేల కోట్ల నష్టం పెద్ద కష్టమా..కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరు ట వేల కిట్లు దండుకున్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.. రైతుల పక్షాన అండగా పోరాటం సాగిస్తాం. కాంగ్రెస్ హయాంలో ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఒకదారి చూపించాం.
ప్రభుత్వం మెడలు వంచి.. ప్రతీ గింజ కొనుగోలు చేసేలా చూస్తాం. రాబోయే నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీ.ఆర్.ఎస్ కు గుణపాఠం చెప్పాలి. 7 ఏళ్లలో తెలంగాణ కు బీజేపీ చేసింది శూన్యం. విభజన చట్టాలను కూడా అమలు చేయలేదు. కేవలం హిందూ-ముస్లిం గొడవలు పెట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ యధాస్థానానికి వెళ్తుంది. భారత్ బంద్ లో భాగంగా టీఆర్ఎస్ రోడ్డు దిగ్భంధం చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు.