ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా… పార్టీ అధ్యక్షున్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఆతృత నాయకుల్లో సహజం. పైగా ఆ పార్టీ అధికారంలో ఉంటే… ఆ ఆతృత ఇంకాస్త రెట్టింపవుతుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఇది చాలా ఎక్కువ. కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా అదే ప్రయత్నం చేస్తాడా…? అంటే ఖచ్చితంగా నో చెప్పలేని పరిస్థితి తెలంగాణలో కనపడుతోంది.
సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకు ఆ పార్టీ నాయకులు ఆరాటపడుతుంటారు. కానీ ఆ లిస్ట్‌లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా చేరిపోయాడన్న విమర్శలు మరోసారి జోరందుకున్నాయి. సీఎం కేసీఆర్, ఉత్తమ్‌కు మధ్య మంచి అవగాహన ఉందన్న ఆరోపణలు ఉండగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగులు కూడా అలాగే ఉన్నాయి అని కాంగ్రెస్‌లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఉత్తమ్ కేటీఆర్‌తో మాట్లాడుతూ… ఏంటీ నా ఫోన్ తీయటం లేదు, బ్లాక్ చేశావా అంటూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ఉత్తమ్‌కు కేటీఆర్‌తో రెగ్యూలర్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని సొంతపార్టీ నేతలే ఫైర్ అయ్యారు. ఇలాంటి సందర్భాలు ఒకటి రెండు సార్లు జరగటంతో లోలోపల కాంగ్రెస్ శ్రేణులు తమ బాస్‌పై అసంతృప్తిగానే ఉన్నాయి.
తాజాగా… సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేసీఆర్‌కు ఉత్తమ్ బర్త్‌డే విషేష్ చెప్పారు. సహజంగా ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషేష్ చెబుతూ తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు. అంతే కాదు ఆ ట్వీట్‌ను కేటీఆర్‌కు కూడా ట్యాగ్ చేయటమే ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశం అవుతోంది. అవకాశం ఉన్న ప్రతిసారి ఉత్తమ్ కేటీఆర్‌ను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో ఏదో మర్మం ఉందని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు.
Advertisements
ఇప్పటికే పీసీసీ నుండి నన్ను తప్పించండని కోరుతున్న ఉత్తమ్… అతి త్వరలోనే మాజీ కాబోతున్నారు. ఆయన పీసీసీ పీఠం దిగగానే గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కేకే, డీఎస్‌లాగే ఉత్తమ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారేమోనంటూ ఉత్తమ్ వ్యతిరేక వర్గం అనుమానిస్తోంది.