వినోద్, కాంగ్రెస్ ఎన్నారై సెల్
కాంగ్రెస్ పార్టీ లో, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నంత కాలం పార్టీ మనుగడ సాధించటం కష్టం, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం బలోపేతం చెయ్యక పోవటానికి కారణం అనైఖ్యత, మీలో మీ విభేదాల వల్ల ప్రజలు అయోమయంలో పడుతున్నారు. ఇప్పుడున్న ఈ టీఆరెఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరా ? అని ప్రజలు ఆలోచించటానికి అవకాశం ఇస్తుంది ఈ అనైక్యత. దీని ఫలితమే తెలంగాణా రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు.
2018లో గెలిచిన ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు అనే నమ్మకం కలిగించే ప్రయత్నం రాష్ట్ర నాయకత్వం ఇవ్వలేకపోయింది.కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం వుంది కాబట్టే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా సీట్లు గెలుపొందిన పరిస్థితి. ప్రజలకు పార్టీ మీద నమ్మకం ఉన్నా, గెలిచిన ఎమ్మెల్యేలకు నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడమే వాళ్ళు పార్టీ మారడంకు కారణం. రాజుపై బలంగా నమ్మకం వున్నపుడే మంత్రులు, సేనాదిపతులు, సైన్యం, ప్రజలు ,రాజ్యం సురక్షితంగా వుంటారు. ఈ జనరేషన్ లో కావలసింది సీనియారిటీ కాదు. ప్రజలకి, సైన్యానికి నమ్మకం కలిగించే నాయకత్వం. భాష మీద పట్టులేనప్పుడు ట్రాన్స్‌లేటర్‌ను పెట్టుకోవటం మంచిది.
అపార అనుభవం ఉన్న చంద్రబాబుని ఏపీలో ప్రజలు ఎందుకు తిరస్కరించారు? అనుభవం లేకనా? జగన్ ఇచ్చిన భరోసా! నాయకత్వ పటిమ, ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉండాలంటే ప్రజల దగ్గరకు వెళ్లాలనే సంకల్పం 3600 కిలో మీటర్ల పాదయాత్ర.అదే నమ్మకం 2019లో సీఎం పదవి. ఓదార్పు యాత్రతో ముందేకెళ్తున్న జగన్ మీద ముసలి నాయకులు ఫిర్యాదులు చేస్తే, పార్టీకి ఏమీ ఒరిగింది జగన్ సీఎం అయ్యారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసినా… తమ నడవడికను మార్చుకోకపోతే ఫిర్యాదుల పర్వంతో తాను మునుగుతూ అధిష్టానంను కూడా ముంచుతారు. ఆ నమ్మకమే 2009లో మహాకూటమిని మట్టి కరిపించిన నాయకత్వం రాజశేఖర్ రెడ్డి గారిది. ఆయనను విమర్శించి కేసులు వేసిన ముసలి నక్కలు కనుమరుగయ్యరు…
రాజులాంటి కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు, సేనాదిపతులు, సైన్యం, మంత్రులంతా కనుమరుగౌతారు. ప్రజలు, రాజ్యం సురక్షితంగానే వుంటారు. మాకు చెప్పలేదు మీకు చెప్పలేదు అనే కాన్సెప్ట్‌తో ఈగోలను మానేసి సీనియర్ అనే నాయకులు గౌరవంగా ఉండి… యువకులకు అవకాశం కల్పించి, రాహుల్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని… పార్టీ బలోపేతం చేసి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షం అనే నమ్మకాన్ని కల్గించండి. అప్పుడే కాంగ్రెస్ ప్లాట్ ఫామ్ పై మనం ఉంటాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి తన కష్టానికి ఫలితంగానే దేవుడు పాలోవర్సన్ ఇచ్చారు. ఇంతటి వాగ్దాటి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరిచేందుకు ఉపయోగపడుతుందని, నేను విశ్వసిస్తున్నా….రేవంత్ రెడ్డి ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం హర్షనీయం.
*జై హో కాంగ్రెస్, జై హో రాహుల్ *