గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల దాడి అంతా ఇంతా కాదు. అసలు కాంగ్రెస్ అనే పదమే భయటకు వినిపించలేదు. ఆ పార్టీ నాయకుల గొంతులు కూడా పెకల్లేదు. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యాక కాంగ్రెస్ క్రమంగా గొంతు పెంచుతోంది.
కేసులకు భయపడి ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని శరణుకోరారని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఇక మరికొన్ని రోజులు కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఎలాంటి ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు ఉండవన్నారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ.. ఇదే టీఆర్ఎస్, బీజేపీ నినాదమని విమర్శించారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ మాత్రమే ఎదగుతుందని, రాజకీయ నిరుద్యోగులే కాంగ్రెస్‌ని వీడుతున్నారన్నారు. పార్టీని వీడుతున్న వారి వల్ల ఎలాంటి నష్టం లేదని, అందరికీ ఆమోదయోగమైన్య వ్యక్తినే టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తామని.. ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు.