ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుపునకు ప్రధాన కారణం ప్రభుత్వ సమర్థ పరిపాలన మాత్రమే కాదు, ఈ విజయం వెనుక కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది.కాంగ్రెస్ పార్టీ జీరో కావడం ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసొచ్చిన అంశం.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా కనీస పోటీ ఇచ్చినా పరిస్థితి వేరేలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.కాంగ్రెస్ ను జీరో చేయడంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు.
దేశ రాజకీయాలను గమనిస్తే ఏ ఎన్నికను పరిశీలించినా మూడు , నాలుగో పార్టీలకు స్థానం లేదు. మొదటి రెండు పార్టీలను మాత్రమే ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు.అందుకే పోటీ బీజేపీ, ఆప్ మధ్య నడిచింది.కానీ మూడో పార్టీగా కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.ఇది ఆప్ కు కలిసొచ్చింది.