హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుపున పద్మావతి రెడ్డి బరిలో ఉండనున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పద్మావతిరెడ్డి పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి కాగా, 2018 ఎన్నికల్లో కోదాడ నుండి పోటీచేసి పద్మావతి రెడ్డి ఓడిపోయారు. హుజూర్ నగర్ లో గత ఎన్నికల్లో ఉత్తమ్ గెలిచినా, ఆ తర్వాత నల్గొండ ఎంపీగా కూడా గెలవటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. అక్టోబర్ 21న పోలింగ్ ఉండగా, అక్టోబర్ 24న ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి