సీఎం కేసీఆర్, అధికార టీఆర్‌ఎస్‌తో అలుపెరగని పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ రేవంత్‌కు అండగా నిలబడ్డారు. కేటీఆర్ అక్రమ ఫాంహౌజ్ నిర్మాణంపై నిలదీసినందుకు అక్రమ కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా చేస్తుండటంతో సీరీయస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం… ఓవైపు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని వెంటనే చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, మరోవైపు రేవంత్ రెడ్డికి పార్టీ తరుఫున న్యాయసహాయం అందించాలని నిర్ణయించింది.
రేవంత్ రెడ్డి కేసులను వాదించేందుకు ఢిల్లీ నుండి సుప్రీంకోర్టు సీనీయర్ లాయర్, కేంద్ర మాజీ న్యాయశాఖమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో పాటు ఐదుగురు సీనీయర్ లాయర్ల ప్రత్యేక బృందం హైదారబాద్ చేరుకుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే తనపై దాఖలైన డ్రోన్ కేసు ఎఫ్.ఐ.ఆర్, కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టుల రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ఢిల్లీ నుండి వచ్చిన న్యాయవాద బృందం రేవంత్ రెడ్డి తరుఫున వాదనలు వినిపించనుంది.