సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సీఎం దిష్టిబొమ్మను తగులబెట్టారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి.. కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. నోటిఫికేషన్లు రాక, నిరుద్యోగ భృతి లేక.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటు రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ నేతలు. వారిని ఆదుకోకుండా ఏం సాధించారని ఇంత గొప్పగా కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.