దళిత బంధు దగాకు వంద రోజులు అంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. మహబూబ్ నగర్ లో ధర్నా నిర్వహించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ అయిపోయిన వెంటనే దళిత బంధు అమలు చేస్తామని చెప్పి వంద రోజులైనా కేసీఆర్ ఏం చేయలేదని మండిపడ్డారు నేతలు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ప్రతీ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రతీ దళిత కుటుంబానికి వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నేతలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన చేపట్టారు. తర్వాత ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ సహా పలువురు పాల్గొన్నారు. దళిత బంధు అమలు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.