రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు పార్లమెంట్ గాంధీ విగ్రహం ముందు పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారాయన. రాజ్యసభలో 12మంది ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీతో పాటు నిరసనలో పాల్గొన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మనం తినే ప్రతీ మెతుకు రైతు రెక్కల కష్టమే అని గుర్తుచుకోవాలన్నారు వెంకట్ రెడ్డి.