సంపత్ కుమార్ ఏఐసీసీ కార్యదర్శి
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. వంద రోజుల్లో ధరలు నియంత్రిస్తామని మోడీ చెప్పాడు. పెట్రోల్ వంద రూపాయలకు లీటర్ అయ్యేలా ఉంది. అంతర్జీతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు రోజు రోజుకు తగ్గి పోతుంటే మన దేశంలో మోడీ, అమిత్ షా ద్వయం పాలనలో ధరలు చుక్కలు అంటుతున్నాయి. కొంత మంది కార్పొరేట్ ల ప్రయోజనాల కోసం వంద కోట్ల మంది ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
రైతు సంఘాలు 50 రోజులుగా ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలకు చట్టబద్దత ఇవ్వడం లేదు. ఈ అంశాలపై రైతులు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి. రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తేశారు. రైతులను మోసం చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రేపు 19న రాజ్ భవన్ ఘెరావ్, నిర్వహిస్తున్నాం. పెద్దఎత్తున ప్రజలు, రైతులు పాల్గొనాలని పిలుపు ఇస్తున్నాం.