అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినట్టు అమెరికా కాంగ్రెస్ ధృవీకరించింది. అధ్యక్ష పీఠానికి కావాల్సిన 270 ఓట్లను బైడెన్ సాధించినట్టు కాంగ్రెస్ పేర్కొంది. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారుల దాడితో ఆందోళన చెందిన కాంగ్రెస్ సభ్యులు కాసేపటి తరువాత సమావేశమై బైడెన్ విజయాన్ని ధృవీకరించారు. పార్టీల కతీతంగా చట్ట సభ సభ్యులు దీన్ని ధృవీకరించారు. దీంతో.. అధికార పీఠం వదిలిలేది లేదంటూ కల్లోలానికి కారణం అవుతున్న ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్టైంది.
అమెరికా చట్టసభల వేదిక క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతు దారులు దాడి చేయడం సంచలనంగా మారింది. పైగా ఆ సమయంలో అమెరికా చట్టసభల్లో ఉన్న సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అమెరికా ఎగువ, దిగు సభల సమావేశాన్ని తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక మరోసారి సమావేశం అయిన సెనెట్… బైడెన్ గెలుపును దృవీకరించింది.