మహారాష్ట్ర రాజకీయ పరిస్థితిపై కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీహార్ జైలు నుంచి ట్విట్టర్ లో స్పందించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. మూడు పార్టీలు తమ పార్టీల సొంత ప్రయోజనాలను పక్కకు బెట్టి రైతుల సంక్షేమం, పెట్టుబడులు, ఉపాధి, సామాజిక న్యాయం, మహిళా, శిశు సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ రాజ్యాంగాన్ని ఘోరంగా ఉల్లంఘించిందన్నారు. రాష్ట్రపతి పాలను తొలగించడానికి ఉదయం 4 గంటలకే రాష్ట్రపతి భవన్ పై దాడి చేసిందన్నారు. ఉదయం 9 గంటల వరకు ఎందుకు ఆగలేకపోయారా? అని ట్విట్టర్ లో ప్రశ్నించారు.
ఐ.ఎన్.ఎక్స్ మీడియా కేసులో వంద రోజులుగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరంను ఈరోజు ఉదయం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు కలిశారు. వారు కలిసిన కొద్ది సేపటికే చిదంబరం ట్విట్టర్ లో స్పందించారు.