కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఓ పరువు నష్టం కేసులో కోర్టులోనే జైరాం లిఖితపూర్వకంగా వివేక్ దోవల్‌కు క్షమాపణలు తెలిపారు. వివేక్ దోవల్‌తో పాటు ఆయన తండ్రి అజిత్ దోవల్ పై క్షణికావేశంలో ఆరోపణలు చేశానన్నారు. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యుల గురించి, వ్యాపారుల గురించి మాట్లాడానన్నారు.
అసలేం జరిగిందంటే…
2019లో అజిత్ దోవల్ కుమారుడు వివేర్ దోవల్ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ సమయంలో జైరాం రమేశ్ పత్రికలో ఓ వ్యాసం రాస్తూ… ఆయన కంపెనీలన్నీ ఢీ కంపెనీలంటూ ఆరోపించారు. అయితే అవన్నీ తప్పులేనని వివేక్ దోవల్ ఆరోపిస్తూ పరువు నష్టం దావా వేశారు. వ