పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి ఇవ్వాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ను మార్చే అవకాశముందన్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానన్నారు.
వరుసగా ఓటములు ఒకవైపు, నేతలంతా పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్న నేపథ్యంలో మల్లురవి వ్యాఖ్యలు సంతరించుకున్నాయి.