కాంగ్రెస్ సినీయర్ నేత, ఏఐసీసీ కోశాధికారిగా దశాబ్ధకాలం పాటు పనిచేసిన కాంగ్రెస్ కురువృద్ధ నేత మోతీలాల్ ఓరా కన్నుముశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏడాది పాటు పనిచేసిన ఆయన, యూపీ గవర్నర్ గా… కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.
కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన చత్తీస్ ఘడ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఓరా మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.