ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల ముందు మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామని టీఆర్ఎస్ తరుపున మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటిస్తుండగా, సత్తా చాటుతామని బీజేపీ ధీమాగా ఉంది. తాజాగా ఖమ్మం ఎన్నికలపై దృష్టిపెట్టిన కాంగ్రెస్, మంత్రి పువ్వాడపై విమర్శలు గుప్పించింది.
కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగి, ఈ స్థాయికి వచ్చిన అజయ్‌కి తమ సత్తా చూపిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సవాల్ విసిరారు. ఖమ్మంలో అక్రమ కేసులు బనాయించే మంత్రి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. సంతలో గొర్రెల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కాంగ్రెస్ సత్తా ఎంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామన్నారు.