భారత్ లో పుణ్య క్షేత్రాలకు లెక్కే లేదు. ఏ మూల చూసిన దేశంలో గుడి ఉంటుంది. ప్రతి ఊర్లోనూ దేవుడికి గుడితో పాటు భూములు, బంగారం ఉంటుంది. ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి, పద్మనాభస్వామి, జగన్నాథ టెంపుల్, సిద్ధివినాయక టెంపుల్ ఇలా ప్రముఖ ఆలయాల వద్ద టన్నుల కొద్ది బంగారు నిల్వలున్నాయి.
తిరుపతి వెంకన్న వద్ద 9000 కిలోల బంగారు నిల్వలు
పద్మనాభస్వామి వద్ద 13లక్షల కిలోల బంగారం
జగన్నాథస్వామి వద్ద 150కిలోల బంగారం
సిద్ధివినాయక స్వామి వద్ద 160కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి.
అయితే… కరోనా కష్టకాలంలో సామాన్య జనం బ్రతకటమే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం 20లక్షల కోట్లు ప్యాకేజీ అంటూ ప్రకటన చేసింది. కానీ ఇందులో దాదాపు అన్నీ రుణాల ద్వారానే రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి హాయంలో తెరపైకి వచ్చిన దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద ఉన్న బంగారం నిల్వల బాండ్లను కానీ, లేదా వాటిని ఇప్పుడు వాడుకోవాలని కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు. ఈ బంగారం నిల్వల మొత్తం విలువ 13లక్షల కోట్ల వరకు ఉంటుంది అని… ప్రధాని ప్రకటించిన ప్యాకేజీలో సగానికి పైగా ఉందని కామెంట్ చేశారు. దేవుడి సొమ్ము పేద ప్రజలకు ఉపయోగపడితే మంచిదే కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
దీనిపై బీజేపీ మండిపడుతోంది. కాంగ్రెస్ నేతల కళ్లు దేవుడి బంగారంపై పడిందని ఆరోపిస్తుంది. దేశాన్ని, దేశప్రజల ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టిందని, దేవుడి బంగారం మాట ఎత్తటం మంచిది కాదని స్పష్టం చేస్తోంది.