చలో ప్రగతి భవన్ కార్యక్రమం కాంగ్రెస్‌లో మరోసారి రచ్చకు దారి తీస్తోంది. తమకు చెప్పకుండా కార్యక్రమానికి ఎలా పిలుపునిస్తారని ఆగ్రహంతో ఊగిపోతున్నారు కాంగ్రెస్ సీనీయర్స్.
తమకు చెప్పకుండా రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చారని ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ సీనీయర్స్. తమను సంప్రదించకుండా… ఏకపక్షంగా ముట్టడికి ఎలా పిలుపునిస్తారని ప్రశ్నిస్తున్నారు. కనీసం పీసీసీ చీఫ్ అయినా తమకు సమాచారం ఇవ్వలేదని, మీడియాకు నోట్ రీలీజ్ చేశారని ఆరోపిస్తున్నారు.
దీనిపై సీఎల్పీలో భట్టి విక్రమార్క, సంపత్, మధుయాష్కీ, విహెచ్, కోదండరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
అయితే, చలో ప్రగతిభవన్ అంశంపై ఒ రోజు ముందు కూడా షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు భేటీ అయి కార్యక్రమం సక్సెస్ పై చర్చించారు. అంతకుముందు ఉత్తమ్ కూడా మాట్లాడినా… హుజూర్‌నగర్ పోలింగ్ దృష్ట్యా తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ ప్రగతిభవన్ గేట్ టచ్ చేసి, సవాల్ చేయటం… సీనీయర్స్ కామ్‌గా ఉన్నారని సోషల్ మీడియా, కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర చర్చ నడుస్తోన్న నేపథ్యంలో… తమకు సమాచారం లేదనటం చర్చనీయాంశం అవుతోంది.
కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ రావటంతోనే… చడీ చప్పుడు కాకుండా ఉండే సీనీయర్స్ తమకు సమాచారం లేదని కొత్త పల్లవి అందుకున్నారని, చలో ప్రగతి భవన్ పిలుపు ఆకస్మాత్తు నిర్ణయం కాదని… వారం ముందే గాంధీబవన్ వేదికగా తీసుకున్న నిర్ణయమంటున్నారు జూనియర్స్. ఓర్వలేకే ఇలాంటి తప్పుడు ప్రచారమని కొట్టిపారేస్తున్నారు.