కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న అసంతృప్తులు ఒక్కసారిగా పెల్లుబిక్కటంతో… కాంగ్రెస్ లో కల్లోలం మొదలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనీయర్స్ వర్సెస్ జూనియర్స్ గా అంతర్యుద్ధం కొనసాగుతున్నట్లు కనపడుతోంది. ఇదే అదునుగా భావిస్తున్న సీనీయర్స్ రేవంత్ ను డ్యామెజ్ చేసే పనిలో పడ్డట్లు కనపడుతోంది. తాజాగా క్రమశిక్షణ సంఘం భేటీయే ఇందుకు నిదర్శనంగా కనపడుతోంది.
ఓవైపు ఇన్నాళ్లు కొట్టుకున్న నేతలంతా మేమంతా ఒక్కటయ్యాం అంటూ ప్రకటన చేశారు. మరోవైపు యూరేనియం, విద్యుత్ లాంటి బర్నింగ్ ఇష్యూస్ పై ఎందుకు మాట్లాడరు అన్నందుకు విపరీతార్ధాలు తీశారు. పైగా క్రేడిట్ పంచాయితీ అంటూ మొదలుపెట్టి… రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ లోని సీనీయర్స్. రేవంత్ రెడ్డికి పీసీసీ ఖాయమైపోయిందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో… పార్టీలోని సీనీయర్స్ వేస్తున్న అడుగులు అనేక అనుమానాలకు తావిస్తోంది.
విద్యుత్ అంశంపై చర్చ సందర్బంలో మా ఎమ్మెల్యేలు ఎందుకు సభలో లేరు… అది కాంగ్రెస్ లేవనెత్తిన అంశం అంటూ రేవంత్ చేసిన వాఖ్యలను కొంతమంది నేతలు తప్పుపట్టగా… తాజాగా క్రమశిక్షణా సంఘం కూడ అదే రీతిలో స్పందించింది. అసెంబ్లీ లో మొదటి రెండు రోజులు మా ఎమ్మెల్యే లు మాట్లాడిన తీరు వల్ల పార్టీ గ్రాఫ్ పెంచుకుంటె, మూడో రోజు రేవంత్ వచ్చి విద్యుత్ సమస్య మట్లాడలేదని అనడం వల్ల పార్టీ గ్రాఫ్ తగ్గించాడు. ఎప్పుడు ఎం మాట్లాడాలనేది సభ్యులు నిర్ణయించుకుంటారు. సంపత్ కు సెల్ఫీ అవసరం లేదు. ఆయన పక్కనే చాలా మంది నిలబడి సెల్ఫీ తీసుకుంటారు…సంపత్ విషయంలో రేవంత్ మఆట్లాడిన తీరు సరైంది కాదు. యురేనియం విషయంలో వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్ లు ముందే ఏఐసీసీ కి రిపోర్ట్ ఇచ్చారు. యురేనియం విషయంలో జనసేన అఖిలపక్షానికి కి కాంగ్రెస్ నేతలు పోవడం తప్పే…
అంటూ క్రమశిక్షణ సంఘం డిసైడ్ చేసింది. ఈ క్రమశిక్షణ సంఘంలోనూ ఎక్కువ మంది సీనీయర్సే ఉన్నారు. అయితే… ఇదే క్రమశిక్షణా సంఘం గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహ ఇతర నేతలు ఎలాంటి వాఖ్యలు చేసిన స్పందించకుండా, రేవంత్ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించటం చూస్తుంటే… రేవంత్ ను బయటకు పంపే ప్రయత్నాలు మొదలైనట్లు కనపడుతున్నాయంటున్నారు రేవంత్ వర్గం నేతలు.
అయితే… దీనిపై కేంద్ర నాయకత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.