కరోనా వైరస్ వ్యాక్సిన్లకు డీసీజీఏ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. వేరే ఏ దేశంలో మూడో దశ ఫలితాలను విశ్లేషించకుండా అనుమతి ఇవ్వలేదని.. కానీ భారత ప్రభుత్వం మాత్రం అతి ముఖ్యమైన ప్రక్రియలను ఎందుకు వదిలేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కేంద్రాన్ని నిలదీశారు. కొవాగ్జిన్‌కు అనుమతి ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనే అని ఆరోపించారు. మూడో దశ ప్రయోగా ఫలితాలను రాకుండానే.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు. మూడో దశ పూర్తి కాకుండా కోవాగ్జిన్‌ను వినియోగించవద్దని కోరిన ఆయన.. మూడో దశ ఫలితాలు వచ్చేలోపు ఆక్స్‌ఫర్డ్ టీకాను వాడితే మంచిదని సలహా ఇచ్చారు.
కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత జైరాం రమేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మరో నేత సల్మాన్ నిజామీ ఈ టీకా మోసం అంటూ ట్వీట్టర్ వేదికగా ఆరోపించారు. ప్రయోగం మొత్తం ఇంకా పూర్తి కాలేదని స్వయంగా భారత్ బయోటెక్ చెప్పినా.. పట్టించుకోకపోడం సరికాదన్నారు.ఇటు ఇప్పటికే మరికొన్ని పార్టీలు కూడా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
The Covaxin has not yet had Phase 3 trials. Approval was premature and could be dangerous. @drharshvardhan should please clarify. Its use should be avoided till full trials are over. India can start with the AstraZeneca vaccine in the meantime. https://t.co/H7Gis9UTQb
— Shashi Tharoor (@ShashiTharoor) January 3, 2021