కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సొంత పార్టీపైనే సెటైర్లు వేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు ఎలాంటి పోరాటం చేయకపోవడంపై ఆయన చురకలంటించారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో అన్యాయం జరగుతుందని హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రైతులు అర్థం చేసుకున్నారని అందుకే..ఆ చట్టాలకు వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్ రైతులని అమాయకులుగా అభివర్ణించిన దిగ్విజయ్ సింగ్.. కనీసం వారికి కొత్త వ్యవసాయ చట్టాలలో జరిగే నష్టాల గురించి కూడా తెలియజెప్పకుండా కాంగ్రెస్ శ్రేణులు నిద్రపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు మేలుకొని.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
మరోవైపు చలి తీవ్రత పెరుగుతున్నప్పటికీ లెక్క చేయకుండా.. ఢిల్లీ సరిహద్దుల్లో 31 రోజులుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తుండగా.. మొత్తం చట్టాలనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.