సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. హజీపూర్ మృగాడు శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు ఏడాదిన్నరగా హైకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తుచేశారు.
హజీపూర్ హత్యలు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఒంటరి అమ్మయిలు, మహిళల్ని టార్గెట్ చేసి ఘోరాలకు పాల్పడ్డాడు శ్రీనివాస్ రెడ్డి. కింది కోర్టు అతడ్ని దోషిగా కూడా తేల్చింది. అయితే హైకోర్టులో మాత్రం కేసు పెండింగ్ లో ఉంది. ఈ విషయాన్ని ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాశారు వీహెచ్.